Cognizant : కాగ్నిజెంట్ జీసీసీ సర్వీస్‌లైన్ గ్లోబల్ హెడ్‌గా శైలజా జోస్యుల

అంతర్జాతీయ టెక్ సంస్థ కాగ్నిజెంట్ (Cognizant), తన గ్లోబల్ కేపబులిటీ సెంటర్ (జీసీసీ) సర్వీస్ లైన్‌కు గ్లోబల్ హెడ్‌గా తెలుగువారైన శైలజా జోస్యుల (Shailaja Josyula )ను నియమించినట్లు తెలిపింది. ఈమె హైదరాబాద్ కేంద్రంగా కాగ్నిజెంట్ అంతర్జాతీయ జీసీసీ కార్యకలాపాల వ్యూహాలు రూపొందిస్తారు. కాగ్నిజెంట్‌లోని 2018`24 మధ్య పలు నాయకత్వ హోదాల్లో ఈమె పనిచేశారు. కాగ్నిజెంట్ హైదరాబాద్ సెంటర్ అధిపతిగా, బీఎఫ్‌ఎస్‌ఐ (BFSI ) కార్యకలాపాల డెలివరీ విభాగం అధిపతిగా వ్యవహరించారు కూడా. తదుపరి స్వల్పకాలం పాటు ఈవైలో పనిచేసి, మళ్లీ కాగ్నిజెంట్‌కు వచ్చారు. ఆర్థిక సేవల కార్యకలాపాల్లో మూడు దశాబ్దాల అనుభవం ఉన్న శైలజ , కాగ్నిజెంట్‌కు ముందు థామస్ రాయిటర్స్ (Thomas Reuters) , హెచ్‌ఎస్‌బీసీ (HSBC) ల్లోనూ పని చేశారు.