బంపర్ ఆఫర్ అందుకోండి.. రష్యా ప్రభుత్వం వినూత్న నిర్ణయం
ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదలై రెండేళ్లు దాటేసింది. ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఉక్రెయిన్ నుంచి ప్రతిఘటన తీవ్రంగా ఉండటంలో రష్యా పక్షాన కూడా ప్రాణనష్టం తీవ్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో యువత సైన్యంలో చేరేలా ప్రోత్సహించేందుకు క్రెమ్లిన్ సరికొత్త ప్రణాళిక సిద్ధం చేసింది. మాస్కో యువత సైన్యంలో చేరితే 1.9 మిలియన్ రూబుల్స్ సైనింగ్ బోనస్ కింద ఇస్తామని ఆ నగర మేయర్ సెర్గీ సోబియానిన్ ప్రకటించారు. భారత కరెన్సీలో ఈ మొత్తం సుమారు రూ.18 లక్షలు ఉంటుంది. ఇక ఈ ఆఫర్ స్వీకరించినవారు ఏటా 5.2 మిలియన్ రూబుల్స్ (రూ.48.8 లక్షలు) సంపాదించే అవకాశం లభిస్తుందని సెర్గీ సోబియానిన్ తెలిపారు. ఎవరైనా ఉక్రెయిన్‌తో పోరాడుతూ గాయపడితే 5,690-11,390 డాలర్లు పొందే అవకాశం ఉంటుంది. మరణించిన సైనికుడు కుటుంబీకులకు 34,150 డాలర్లను ప్రభుత్వం చెల్లిస్తుంది.






