ఇరాన్‌కు రష్యా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్
మధ్య ప్రాశ్చ్యంలో ప్రాంతీయ యుద్ధం సంభవించే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో ఇరాన్‌కు రష్యా అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను సరఫరా చేయడం ప్రారంభించింది. వాటితో పాటు రేడార్లను కూడా పంపించింది. హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియేప్ాను టెహ్రాన్‌లో ఇజ్రాయెల్ హత్య చేసినందుకు ప్రతీకారం తీసుకోవాలని ఇరాన్ భావిస్తున్న నేపథ్యంలో రష్యా అందిస్తున్న సహకారానికి ప్రాధాన్యం ఏర్పడిరది. మరోవైపు లెబనాన్‌లోని బీరూట్ గగనతలంలో మూడు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. కాగా, వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెలీ దళాలు తనిఖీలు చేసి 12 మంది పాలస్తీనియన్లను హతమర్చాయి.






