యూకేలో అల్లర్లు.. కేంద్రం అలర్ట్!
బ్రిటన్లో వలస వ్యతిరేక గ్రూపులు చేపట్టిన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. బ్రిటన్లోని పలు నగరాలు, పట్టణాలలో వీరి నిరసనలు హింసాత్మకంగా మారాయి. అవి క్రమేణా దేశమంతా విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడున్న భారతీయులకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు చేసింది. ఈ మేరకు లండన్లోని భారత రాయబార కార్యాలయం అడ్వయిజరీని జారీ చేసింది. ఇటీవల అల్లర్ల గురించి మీకు తెలిసే ఉంటుంది. భారత రాయబార కార్యాలయం పరిస్థితిని గమనిస్తోంది. ఇక్కడికి వచ్చే పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. స్థానిక మీడియా సంస్థలు, భద్రతా ఏజెన్సీల సూచనల్ని పాటించాలి. నిరసనలు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండేలా జాగ్రత్తగా వహించాలి అని అడ్వయిజరీ నోట్లో హైకమిషన్ పేర్కొంది.






