రష్యా సైన్యంలోని భారతీయులకు విముక్తి … పుతిన్ నిర్ణయం
భారత్కు భారీ దౌత్య విజయం లభించింది. రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయులను విడుదల చేసేందుకు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమ్మతించారు. వెంటనే వారిని ఆర్మీ విధులను వెనక్కి రప్పిస్తామని, స్వదేశానికి పంపించడానికి ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఇచ్చిన ప్రైవేట్ విందులో పుతిన్ మాట ఇచ్చినట్లు సమాచారం. రెండు రోజుల పర్యటన నిమిత్తం మోదీ మాస్కో చేరుకున్నారు. ఈ సందర్భంగా మాస్కో శివార్లలోని నోవో`ఒగార్యోవో అధికార నివాసంలో మోదీని పుతిన్ సాదరణంగా ఆహ్వానించారు. ఆప్యాయంగా ఇరునేతలూ హత్తుకున్నారు. ఈ సందర్భంగా రాత్రి మోదీకి పుతిన్ ప్రత్యేక విందు ఇచ్చారు. ఈ క్రమంలో రష్యా సైన్యంలో భారతీయుల విషయాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. దీనికిగాను వారిని విడుదల చేస్తామని పుతిన్ హామీ ఇచ్చిరని అధికారిక వర్గాల సమాచారం.






