ఫిజీలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన రాష్ట్రపతి

ఫిజీ పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నదీ నగరంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. భారత్, ఫిజీల చారిత్రక సంబంధాలు, ఇరు దేశాల నడుమ భాగస్వామ్య బలోపేతంపై ఫిజీ పాలకులతో ముర్ము చర్చలు జరిపారు. ఓ ముఖ్యమైన, విజయవంతమైన పర్యటన ముగిసింది. ఫిజీ ఉప ప్రధాని బిమన్ ప్రసాద్ నదీ విమానాశ్రయంలో ద్రౌపదీ ముర్ముకు ఘనంగా వీడ్కోలు పలికారు. రాష్ట్రపతి అక్కడి నుంచి న్యూజిలాండ్‌కు బయలుదేరారు.