న్యూజిలాండ్ ప్రధాని లక్సన్తో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము భేటీ
ఫిజీ పర్యటన నుంచి వెల్లింగ్టన్కు చేరుకొన్న భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్తో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవడం, ముఖ్యంగా విద్య, వాణిజ్యం, సాంస్కృతిక రంగాల్లో పరస్పరం సహకరించుకోవడంపై ఇరువురు నేతలు చర్చించారు. అంతకుమునుపు సువా నుంచి బయలుదేరి ముర్ముకు ఘనమైన గౌరవ వందనం లభించిది. రాప్ట్రపతి పర్యటనతో ఇండియా, న్యూజిలాండ్ భాగస్వామ్యానికి మరింత ఊతం లభించినట్లు అయిందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
న్యూజిలాండ్ గవర్నర్ జనరల్ డేమ్ సిండీ కిరోత్ సమావేశమైన ముర్ము ఇరు దేశాల నడుమ వివిధ రంగాల్లో సహకారం గురించి చర్చలు జరిపారు. అనంతరం న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి పీటర్స్ రాష్ట్రపతిని కలిశారు. వెల్లింగ్టన్లో జరిగిన న్యూజిలాండ్ అంతర్జాతీయ విద్యాసదస్సును ఉద్దేశించి కూడా ముర్ము ప్రసంగించారు. విద్యకు ఉన్న పరివర్తన శక్తి గురించి ఆమె మాట్లాడారు. న్యూజిలాండ్‌లోని వివిధ విద్యాసంస్థల్లో 8,000 మంది భారతీయ విద్యార్థులు నాణ్యమైన ఉన్నత విద్యను అభ్యసిస్తున్నట్లు తెలిపారు. వెల్లింగ్టన్ రైల్వేస్టేషను ఏర్పాటుచేసిన మహాత్మాగాంధీ విగ్రహానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పుష్పాంజలి ఘటించారు.






