నెల్సన్ మండేలాకు అపూర్వ గౌరవం
దక్షిణాఫ్రికా జాతిపిత నెల్సన్ మండేలాకు అపూర్వ గుర్తింపుతో యునెస్కో సత్కరించింది. ఆయన చదువుకున్న ఈస్టెర్న్ కేప్ ప్రావిన్స్‌లోని ఫోర్ట్ హేర్ విశ్వవిద్యాలయాన్ని యునెస్కో వారసత్వ పరిరక్షణ జాబితాలో చేర్చారు. అలాగే, ఆయన తొలిసారి రాజకీయంగా యాక్టివ్ అయిన క్వెకెజ్వెనీ గ్రామాన్ని కూడా గుర్తించారు. ఈ గ్రామంలో తనకు ఉన్న అనుబంధాన్ని తన ఆత్మకథ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్‌లో మండేలా ప్రత్యేకంగా ప్రస్తావించారు. దక్షిణాఫ్రికాలోని మొత్తం 14 ప్రదేశాలను కలుపుకుని మానవహక్కులు, విముక్తి, సయోధ్య, నెల్సన్ మండేలా చారిత్రక ప్రదేశాలు పేరుతో కూడిన జాబితాను యూనెస్కో రూపొందించింది.






