జెలెన్స్కీతో ప్రధాని మోదీ భేటీ
ఉక్రెయిన్లో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు. రాజధాని కీవ్లోని అమరుల స్మారక ప్రాంతానికి చేరుకున్న మోదీకి స్వాగతం పలికిన అధ్యక్షుడు జెలెన్స్కీ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం రష్యా దాడిలో మరణించిన చిన్నారులకు మోదీ నివాళి అర్పించారు. ఉక్రెయిన్ ఎదుర్కొన్న అతిపెద్ద సంక్షోభాల ఆనవాళ్లకు సంబంధించి అక్కడి మ్యూజియంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఇద్దరు నేతలు వీక్షించారు. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం పరిష్కార మార్గాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు.






