మీ శ్రమకు దక్కిన ఫలితం… మోదీకి పుతిన్ అభినందనలు
ప్రధాని మోదీని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసలతో ముంచెత్తారు. మోదీ గౌరవార్థం విందు ఇచ్చిన సందర్భంగా ఆయన మూడోసారి విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు.మూడోసారి గెలిచినందుకు శుభాకాంక్షలు. ఇది యాదృచ్చికంగా సాధించిన విజయం కాదు. ఎన్నో ఏళ్లుగా మీరు చేసిన కృషికి, మీ శ్రమకు దక్కిన ఫలితం. మీకు మీ సొంత ఆలోచనలున్నాయి. మీరు ఎంతో శక్తిమంతమైన వ్యక్తి. భారత్, భారతీయుల ప్రయోజనాల కోసం లక్ష్యాలను సాధించగల దిట్ట అని పుతిన్ కొనియాడారు. భారత్ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ప్రశంసించారు. ఇద్దరు నేతలు పుతిన్ నివాసంలో టీ తాగుతూ మాట్లాడుకున్నారు.






