దౌత్యంలో భారత్ కీలకం : జెలెన్స్కీ
భారత్‌లో పర్యటించేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. రష్యాతో తమ దేశ యుద్ధానికి తెరదించడం కోసం జరిగే అంతర్జాతీయ దౌత్య ప్రయత్నాల్లో భారత్ కీలకంగా మారగలదని పేర్కొన్నారు. కీవ్‌లో మోదీతో చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రష్యా అధ్యక్షుడు పుతిన్ కంటే శాంతినే మోదీ ఎక్కువగా కోరుకుంటున్నారని జెలెన్స్కీ అన్నారు. కానీ శాంతిని పుతిన్ కోరుకోకపోవడమే సమస్యగా మారిందని పేర్కొన్నారు. భారత్‌లో పర్యటించాలంటూ జెలెన్స్కీని మోదీ ఆహ్వానించిన సంగతి గమనార్హం.






