ఉక్రెయిన్ పర్యటన విశేషాలను.. బైడెన్‌తో పంచుకున్న మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఉక్రెయిన్ పర్యటన వివరాలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో పంచుకున్నారు. ఉక్రెయిన్‌లో వీలైనంత త్వరగా శాంతి, సుస్థిరతను నెలకొల్పడానికి భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని పునరుద్ఘాటించారు. మోదీ బైడెన్‌తో ఫోన్లో మాట్లాడారు. బంగ్లాదేశ్‌లో అశాంతిపైనా వీరిద్దరూ చర్చించుకున్నారు. బంగ్లాదేశ్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. బంగ్లాలో మైనారిటీలు, ముఖ్యంగా హిందువులకు రక్షణ కల్పించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై సమగ్రంగా చర్చించాం అని తెలిపారు. క్వాడ్‌తో సహా అంతర్జాతీయ వేదికలపై సహకారాన్ని పెంపొందించుకోవడానికి కట్టుబడి ఉన్నామని ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు. ఇరుదేశాల ప్రజలకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా భారత్`అమెరికా బంధం కొనసాగుతోందన్నారు.






