ఏలియన్స్ ఉనికికి ఆధారాల్లేవ్ : అమెరికా రక్షణ విభాగం
అంతుచిక్కని రహస్యంగా ఉండిపోయిన గ్రహాంతరవాసుల (ఏలియన్స్) ఉనికి, వారికి చెందినవిగా భావిస్తున్న గుర్తు తెలియని ఎగిరే పళ్లాలు (యూఎఫ్‌వో)కు సంబంధించి అమెరికా రక్షణ విభాగం ఓ స్పష్టత నిచ్చింది. ఏలియన్స్ ఉనికిని నిర్ధారించే ఆధారాలేవీ లభించలేదని తేల్చి చెప్పింది. యూఎఫ్‌వోలు కనిపించాయంటూ 1945 నుంచి వినిపిస్తోన్న వార్తలపై పరిశోధన అనంతరం ఈ నిర్ధారణకు వచ్చినట్లు విడుదల చేసిన నివేదిక పేర్కొంది. అమెరికా ప్రభుత్వం, ప్రైవేటు కంపెనీలు సంయుక్తంగా పరిశోధనలు నిర్వహించాయి. అధ్యయన నివేదికలోని మరిన్ని వివరాలను త్వరలో వెలువరిస్తామని రక్షణ విభాగం తెలిపింది.






