అంగరంగ వైభవంగా పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు
పారిస్ ఒలింపిక్స్ 2024 ఆరంభ వేడుకలు అట్టహాసంగా సాగాయి. విశ్వక్రీడా వేదికపై త్రీవర్ణ పతాకం రెపరెపలాడింది. ప్రపంచమంతా అత్యంత ఆసక్తిగా ఎదురు చూసిన పారిస్ ఒలింపిక్స్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఒలింపిక్స్ చరిత్రలోనే తొలిసారి స్పోర్ట్స్ విలెజ్లో కాకుండా సేన్ నదిపై ఈ వేడుకలు జరుపుకున్నారు. వందేళ్ల తర్వాత మళ్లీ ఒలింపిక్స్ ఆతిథ్యమిస్తున్న ఫ్రాన్స్, దానికి తగట్టే అత్యంత అధునిక తరహా లో ఒపెనింగ్ సెలబ్రేషన్స్ చేసుకుంది. 100 పడవల్లో 206 దేశాల అథ్లెట్లు పరేడ్ నిర్వహించారు. భారత తరపున స్టార్ షట్లర్ తెలుగు తేజం పీవీ సింధు, టేబుల్ టెన్నిస్స్టార్ ప్లేయర్ శరత్ కమల్ ఫ్లాగ్ బేరర్లుగా ముందుండి భారత బృందాన్ని నడిపించారు. ఓపెనింగ్ సెర్మనీలో భారత క్రీడాకారులు సంప్రదాయ దుస్తులతో ఆకట్టుకున్నారు. భారతీయ ఉట్టిపడేలా త్రివర్ణ పతాకం రంగులతో ఈ దుస్తులను తయారు చేశారు.






