జకోవిచ్ కు షాకిచ్చిన లుకానార్డీ
ఇండియన్ వెల్స్-2024 టెన్నిస్ టోర్నీలో వరల్డ్ నెం.1 నోవాక్ జకోవిచ్‌కు భారీ షాక్ తగిలింది. పురుషుల సింగిల్స్‌లో సెర్బియా స్టార్‌పై 123 వ ర్యాంకర్ లుకా నార్డీ సంచలన విజయం సాధించాడు. మూడో రౌండ్లో ఇటలీకి చెందిన 20 ఏళ్ల లుకా నార్డీ 6-4, 3-6, 6-3 తేడాతో టాప్ సీడ్ నోవాక్ జకోవిచ్‌ను ఓడిరచి కొత్త చరిత్ర సృష్టించాడు. ఏటీపీ మాస్టర్స్‌లో వరుసగా 11 మ్యాచుల్లో గెలిచిన జకోవిచ్‌కు చివరికి 12వ మ్యాచ్‌లో 20 ఏళ్ల యువ ఆటగాడు నార్డీ బ్రేక్ వేశాడు. మొత్తంగా 24 గ్రాండ్ స్లామ్ విజేత నోవాక్పై అద్భుత విజయం సాధించిన నార్డీ మ్యాచ్ అనంతరం భావోద్వేగానికి గురయ్యాడు.






