ఉత్తర కొరియాకు రష్యా ఆపన్న హస్తం
భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్న ఉత్తర కొరియాకు మద్దతునందిస్తామని రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ హామీనిచ్చారు. గత నెల 27న రికార్డు స్థాయిలో వర్షపాతం కురిసిందని, ఫలితంగా లెక్కలేనంత మంది మరణించారు. వర్షాలు, వరదలు సృష్టించిన బీభత్సం పట్ల పుతిన్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. అవసరమైన సాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు. ఉత్తర కొరియాకు తక్షణమే మానవతా సాయం అందుతుందని పుతిన్ ప్రకటించారు. దానిపై కిమ్ స్పందిస్తూ నిజమైన మిత్రుని పట్ల ప్రత్యేక భావోద్వేగతను ప్రకటించారు. ఆపన్న హస్తం అందించినందుకు పుతిన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.






