2004 తర్వాత మళ్లీ ఆ దేశానికి… అథ్లెట్‌కు స్వరం
ప్రపంచ చాంపియన్ నోహ లైల్స్ పారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల 100 మీటర్ల రేస్‌ను గెలిచాడు. అత్యంత వేగవంతమైన వీరుడిగా నిలిచారు. ఫైనల్ రేస్ ఉత్కంఠ రేపింది. స్ప్రింట్ అథ్లెట్లు నువ్వా నేనా అన్నట్లుగా పరుగు తీశారు. గోల్డ్ మెడల్ విన్నర్ నోహ లైల్స్ కేవలం 9.79 సెకన్లలో టార్గెట్‌ను చేరుకున్నాడు. ఆధునిక చరిత్రలోనే ఈ పారిస్ రేస్ చాలా అరుదైనది. వంద మీటర్ల చాంపియన్‌ను సెకనులోని 5000వ వంతుతో డిసైడ్ చేశారు. ఫోటో ఫినిష్‌లో జమైకా స్టార్ రన్నర్ కిషేన్ థాం ప్పన్ రెండో స్థానంలో నిలిచాడు. వాస్తవానికి నోహ లైల్స్ కిషెన్ థాంప్సన్‌లు 9.79 సెకన్లలోనే 100 మీటర్ల లక్ష్యాన్ని చేరుకున్నారు. కానీ అమెరికాకు చెందిన నోహ లైల్స్ ఆ టార్గెట్ లైన్‌ను 784 సెకన్లలో చేరుకోగా, థాంప్న్ ఆ టార్గెట్‌ను 789 సెకన్లలో చేరుకున్నారు. దీంతో అమెరికా చిరుతకే స్వర్ణ పతకం దక్కింది. 2004 ఏథేన్ గేమ్స్‌లో జస్టిన్ గాట్లిన్ చివరి సారి అమెరికా తరపున 100 మీటర్ల మెడల్ సాధించాడు. ఆ తర్వాత నోహ మళ్లీ ఆ దేశానికి గోల్డ్ మోడల్ అందించాడు.






