ఐవోసీలోకి నీతా అంబానీ
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ)లో ప్రముఖ క్రీడా ఔత్సాహికురాలు నీతా అంబానీ తిరిగి ఏకగీవ్రంగా ఎన్నికయ్యింది. బుధవారం జరిగిన 142వ ఐవోసీ సెషన్లో నీతా అంబానీ 100 శాతం ఓటింగ్ సొంతం చేసుకుంది. ఎన్నికపై ఆమె స్పందిస్తూ ఐవోసీ సభ్యురాలిగా తిరిగి ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఐవోసీఏ అధ్యక్షుడు థామస్ బాచ్‌తో పాటు సహచర సభ్యులకు కృతజ్ఞతలు. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. ఈ ఎన్నిక నా వ్యక్తిగతం కాదు, ప్రపంచ క్రీడా యవనికపై భారత్ క్రీడాభివృద్ధికి నిదర్శనం. ఈ సందర్భాన్ని ప్రతీ భారతీయునితో పంచుకోవాలనుకుంటున్నాను అని పేర్కొంది. భారత ఒలింపిక్ సమాఖ్య (ఐవోసీ) తో కలిసి రిలయన్స్ ఫౌండేషన్ ఒలింపిక్స్ కోసం ప్రత్యేకంగా ఇండియా హౌజ్ ఏర్పాటు చేసింది.






