పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ బోణీ
ఒలింపిక్స్‌లో స్వర్ణంపై గురిపెట్టిన స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ పారిస్‌లో ఘనంగా బోణీ కొట్టింది. మహిళల 50 కేజీల విభాగం తొలి రౌండ్లో ఈ ప్రపంచ ఛాంపియన్ 5`0తో మ్యాక్సీ కారినా (జర్మనీ)ని చిత్తు చేసింది. ఆరంభంలో కారినా నుంచి భారత బాక్సర్‌కు గట్టిపోటీ ఎదురైంది. అయితే పదునైన పంచ్లలో విరుచుకుపడిన నిఖత్.. ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. తెలివిగా ఆడుతూ ప్రత్యర్థి పంచ్‌లను తప్పించుకుంటూ దాడి చేసింది. ఒక దశలో నిఖత్ ధాటికి కారినా నిలవలేకపోయింది. దాంతో రిఫరీ ఔట్‌ను ఆపేసి నిఖత్‌ను విజేతగా ప్రకటించాడు.






