అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐక్యరాజ్యసమితికి టెహ్రాన్ రాయబారి అమీర్ సయీద్ ఐరవానితో ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భేటీ అయ్యారు. ఓ రహస్య ప్రదేశంలో గంటలకు పైగా వీరిద్దరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. టెహ్రాన్`వాషింగ్టన్ మధ్య ఉద్రిక్తతల గురించి వీరిద్దరూ చర్చించారని, వీరి సమావేశం ఫలప్రదం అయ్యిదని సదరు వర్గాలు చెప్పినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఇరాన్ పై అమెరికా విధించిన ఆంక్షలను తొలగించాలని, టెహ్రాన్‌తో వాణిజ్యం చేయాలని ఆ దేశ రాయబారి మస్క్‌ను కోరినట్లు తెలిసింది. అయితే వీరి భేటీపై అటు ట్రంప్`మస్క్ వర్గం నుంచి గానీ, ఐరాసలోని ఇరాన్ మిషన్ నుంచి ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేదు. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే ఇరాన్‌తో దౌత్య సంబంధాలను పునరుద్ధరించుకునే ఆలోచనలో ట్రంప్ ఉన్నారనే దానికి ఈ బేటీ సంకేతం కానుంది.






