తక్షణమే మా వాళ్లను వెనక్కు పంపండి : భారత్
ఏజెంట్ల చేతితో మోసపోయి రష్యా యుద్ధ భూమికి తరలించబడిన భారతీయ యువతను తక్షణం వెనుక్కు పంపేలా చర్యలు తీసుకోవాలని రష్యా ప్రభుత్వాన్ని గట్టిగా కోరినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగాల ఎరచూపి మోసగించిన ఏజెంట్లు, ఇతర వర్గాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఉద్యోగాల పేరుతో చాలామంది భారతీయులు మోసపోయి రష్యా తరపున ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న విషయం నిజమేనని ఆయన వెల్లడిరచారు. నిరుద్యోగ యువతను మోసగిస్తున్న ముఠాను సీబీఐ గుర్తించిందని, నిందితులపై మానవ అక్రమ రవాణా నేరంపై కేసులు నమోదు చేస్తారని తెలిపారు.






