128 ఏళ్ల తర్వాత … లాస్ ఏంజిలెస్‌లో
లాస్ ఏంజిలెస్ వేదికగా 2028 ఒలింపిక్ గేమ్స్ జరగనున్నాయి. దాదాపు 128 ఏళ్ల తర్వాత క్రికెట్‌కు చోటు లభించింది. చివరిసారిగా 1990లో క్రికెట్ జరిగింది. అయితే, లాస్ ఏంజిలెస్‌లో క్రికెట్ ఆడేందుకు సరైన మైదానాలు అందుబాటులో లేవనే కారణంతో మ్యాచ్‌లను న్యూయార్క్‌లో నిర్వహించేందుకు ఒలింపిక్స్ కమిటీ నిర్వహకులు చూస్తున్నారు. లాస్ ఏంజిలెస్ న్యూయార్క్‌కు మధ్య దాదాపు 3 వేల మైళ్ల దూరం ఉంటుంది. ఈ విషయంపై లాస్ ఏంజిలెస్ ఒలింపిక్స్ చైర్మన్ వాసర్మెన్ స్పందించారు. లాస్ ఏంజిలెస్‌లో మాకు క్రికెట్ వేదికలు లేవు. అందుకోసం సరైన ప్రాంతాలను అన్వేషించాల్సి ఉంది. క్రికెట్ మ్యాచ్‌లు మరింత విజయం సాధించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం. ఒకవేళ లాస్ ఏంజిలెస్లోనే మంచి మైదానాలు దొరికితే ఇక్కడే నిర్వహిస్తాం. అలా సాధ్యం కానిపక్షంలో ఉత్తమ ప్రాంతానికి మ్యాచ్‌లను తరలిస్తామని వాసర్‌మన్ వెల్లడిరచారు.






