మిస్ వరల్డ్ క్రిస్టినా పిజ్కోవా
మిస్ వరల్డ్-2024 కిరీటం చెక్ రిపబ్లిక్ భామ క్రిస్టినా పిజ్కోవా దక్కించుకుంది. మిస్ వరల్డ్ పోటీల్లో మొత్తం 112 దేశాల సుందరీమణులు పాల్గొనగా, క్రిస్టినా ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో యాస్మిన్ అజైటౌన్ (లెబనాన్), ఆచే అబ్రహాంస్ (ట్రినిడాడ్ అండ్ టూబాగో) నిలిచారు. భారత్కు ఈ పోటీల్లో నిరాశే మిగిలింది. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కన్నడ భామ సినీ శెట్టి టాప్`8 స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చివరి వరకూ ఆమె గట్టిపోటీనే ఇచ్చినా టాప్`3లోకి రాలేకపోయింది. మిస్ వరల్డ్`2024 పోటీలకు నీతా అంబానీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజేతలను సన్మానించారు. ఈ సందర్భంగా నీతా అంబానీకి మిస్ వరల్డ్ హ్యూమానిటేరియన్ అవార్డును మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్వుమెన్ జూలియా మోర్లీ అందజేశారు.






