ఐరాసలో ప్రసంగించిన తెలుగు యువకుడు
తెలుగు యువకుడు ఐరాసలో ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా మోపిదేవి మండలం ఆడపావారిపాలెం గ్రామానికి చెందిన పండలనేని శివప్రసాద్ రెండో కుమారుడు కృష్ణకిశోర్ అమెరికాలో చదువుతున్నారు. ఈయనకు ఐరాసలో మాట్లాడే అవకాశం రావడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. కృష్ణకిశోర్ కొలంబియా యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ ఎఫైర్స్ ( సిపా`ఎస్ఐపీఏ)లో మాస్టర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుతున్నారు. ఐక్యరాజ్య సమితితో సస్టైనబుల్ డెవలప్మెంట్ (సుస్థిర అభివృద్ధి) అనే అంశంపై అభిప్రాయాలు తెలిపేందుకు న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయం కృష్ణకిషోర్‌కు ఆహ్వానం పంపింది. దాదాపు 10 నిమిషాలకు పైగా ప్రసంగించి అక్కడి ప్రతినిధులను ఆకట్టుకున్నారు. కృష్ణకిషోర్ సిపా స్టూడెంట్ అసోసియేషన్ అకడమిక్ చైర్మన్‌గా, సౌత్ ఏషియన్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగానూ ఉన్నారు.






