అమెరికా రాజకీయాలతో మాకేం పని… యుద్ధ లక్ష్యాలపైనే మా దృష్టి
అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి వైదొలగినట్లు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించిన తర్వాత.. రష్యా తొలిసారిగా స్పందించింది. అమెరికా రాజకీయాలు తమకు ముఖ్యం కాదని, ఉక్రెయిన్ యుద్ధ లక్ష్యాలను చేరుకోవడానికే ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు రష్యా అధ్యక్ష భవనం క్రెమిన్ల్ అధికార ప్రతినిధి పెస్కోవ్ మీడియాతో మాట్లాడారు. అమెరికా ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల సమయముంది. ఈ సుదీర్ఘ సమయంలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. వాటి గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. ఏం జరుగుతుందో మనం ఓపికగా పరిశీలిస్తూ ఉండాలి. అయితే రష్యా మాత్రం ఉక్రెయిన్పై చేస్తున్న స్పెషల్ మిలటరీ ఆపరేషన్ లక్ష్యాలను చేరుకోవడానికే ప్రాధాన్యం ఇస్తుంది అని తెలిపారు.






