Dhanush Srikanth: టోక్యో డెఫ్లింపిక్స్లో డబుల్ గోల్డ్, ప్రపంచ రికార్డు సాధించిన KLH GBS విద్యార్థి
కే ఎల్ హెచ్ గ్లోబల్ బిజినెస్ స్కూల్ (KLH GBS), హైదరాబాద్‌కు చెందిన ప్రతిభావంతుడైన బిబిఏ విద్యార్థి మరియు భారత షూటింగ్ స్టార్ ధనుశ్ శ్రీకాంత్ టోక్యో డెఫ్లింపిక్స్ 2025లో ఐక్యంగా రెండు బంగారు పతకాలు సాధించి ప్రపంచ రికార్డులు బద్దలుకొట్టాడు.
హైదరాబాద్‌కు చెందిన ధనుశ్, పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్స్‌లో అద్భుతమైన 252.2 స్కోర్ సాధించి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు క్వాలిఫికేషన్ రౌండ్లో 630.6 స్కోర్ చేసి డెఫ్లింపిక్స్ రికార్డు సృష్టిస్తూ ఫైనల్స్‌కు అర్హత పొందాడు.
ఈ విజయాలతో ధనుశ్ తన మూడవ మరియు నాలుగవ డెఫ్లింపిక్స్ స్వర్ణ పతకాలను సాధించాడు. 23 ఏళ్ల ధనుశ్ 2022లో బ్రెజిల్లో జరిగిన డెఫ్లింపిక్స్లో రెండు బంగారు పతకాలు సాధించి అంతర్జాతీయ షూటింగ్లో భారత శక్తిని ప్రపంచానికి చాటాడు.
ధనుశ్ అసాధారణ విజయంపై మాట్లాడిన కేఎల్ డీమ్డ్ టు బీ యూనివర్శిటీ వైస్ ప్రెసిడెంట్ ఇఆర్. కోనేరు లక్ష్మణ్ హవీష్ గారు మాట్లాడుతూ “ధనుశ్ చూపిస్తున్న దృఢ సంకల్పం, క్రమశిక్షణ, పట్టుదల ప్రతి విద్యార్థికి స్ఫూర్తి. అతని ప్రపంచ రికార్డు భారతదేశ గర్వం. కేఎల్ హెచ్ జిబిఎస్ అతని ప్రయాణం పట్ల గర్వపడుతోంది. హద్దులను చెరిపేసి కొత్త అవకాశాలను సృష్టించే అథ్లెట్లకు మా పూర్తి సహకారం అందిస్తాం.”
మాట్లాడలేకపోవడం, వినికిడి లోపం ఉన్నప్పటికీ, ధనుశ్ నిరంతరం తనేంటో నిరూపిస్తున్నాడు—అంగవైకల్యం ఒక అడ్డంకి కాదని, అది ఒక కొత్త బలం అని. అతని క్రమశిక్షణ, కచ్చితత్వం భారతదేశానికి అత్యంత గౌరవనీయమైన అథ్లెట్లలో ఒకరిగా నిలబెట్టాయి.
కెఎల్ హెచ్ గ్లోబల్ బిజినెస్ స్కూల్ హైదరాబాద్ ధనుశ్ శ్రీకాంత్‌కు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, భారతదేశాన్ని గ్లోబల్ వేదికపై గర్వించేలా చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతోంది. ధైర్యం, ఉత్తమత, పట్టుదల అనే విలువలను ప్రతిబింబించినందుకు అతనిని సత్కరిస్తోంది.






