కిమ్ దూకుడు.. అణు క్షిపణి లాంఛర్లతో
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అణ్వాయుధాల దూకుడు కొనసాగిస్తున్నాడు. తాజాగా ఓ రహస్య ప్రదేశంలో నిర్వహించిన ఓ వేడుకలో దేశీయంగా తయారు చేసిన కొత్త న్యూక్లియర్ క్షిపణి లాంఛర్లను ప్రదర్శించారు. ఆ వేడుకల్లో మొత్తం 250కు పైగా అణు క్షిపణి లాంఛర్లు ప్రదర్శించినట్లు తెలిసింది. వాటిని సాయుధ దళాలకు కీలకంగా మారనున్న కొత్త రకం వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణి లాంఛర్లుగా పేర్కొన్నారు. ఈ ప్రదర్శన జరుగుతున్నప్పుడు కిమ్ జోంగ్ ఉన్న ఉన్నత సైనికాధికారులతో కలిసి కనిపించారు. తక్కువ సంఖ్యలో ప్రజలు వేడుకకు వచ్చినట్టు చిత్రాలను బట్టి తెలుస్తోంది. ఇప్పటికే ఉత్తర`దక్షిణ కొరియా మధ్య ఉద్రిక్తలు పెరిగాయి.






