జో బైడెన్‌తో జిన్‌పింగ్ భేటీ
పెరూ రాజధాని లిమాలో రెండు రోజులపాటు సాగిన ఆసియా-పసిపిక్ ఆర్థిక సహకార ఫోరం సమావేశాలు ముగిశాయి. వీటికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధినేత షీ జిన్‌పింగ్ సహా 21 మంది నేతలు హాజరయ్యారు. ఈ సందర్బంగా బైడెన్‌తో జిన్‌పింగ్ భేటీ అయ్యారు. స్థిరమైన చైనా`అమెరికా సంబంధం రెండు దేశాలకే కాకుండా మానవత్వపు భవిష్యత్తు కు కీలకమని బైడెన్‌కు జిన్‌పింగ్ వివరించారు. ఈ క్రమంలో తెలివైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అలాగే దక్షిణ చైనా సముద్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదని బైడెన్‌ను జిన్‌పింగ్ కోరారు. అమెరికా నూతన అధికార యంత్రాంగంతో కలిసి పనిచేసేందుకు చైనా సిద్ధంగా ఉందని తెలిపారు. తమ రెండు దేశాల మధ్య పోటీ వివాదాలకు దారి తీయకూడదని జిన్‌పింగ్‌తో బైడెన్ పేర్కొన్నారు.






