Joe Biden : అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్‌కు క్యాన్సర్

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden ) ప్రొస్టేట్ క్యాన్సర్ (Prostate cancer) తో బాధపడుతున్నారు . ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల్లో బైడెన్‌కు క్యాన్సర్ నిర్ధారణ అయ్యిందని, అందోళనకర స్థాయిలో వ్యాధి తీవ్రత ఉందని, ఎముకలకూ వ్యాపిస్తోందని ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. బైడెన్‌కు క్యాన్సర్ నిర్దారణ అయిన నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పందించారు. విషయం తెలిసి నేను, మెలానియా (Melania) చాలా బాధపడ్డాం. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం అని పేర్కొన్నారు. బైడెన్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని పేర్కొన్నారు.