బ్లింకెన్‌తో జై శంకర్ భేటీ
భారత విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ జపాన్ రాజధాని టోక్యోలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో సమావేశమయ్యారు. రెండుదేశాల మధ్య సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించామని జై శంకర్ తెలిపారు. మూడు వారాల క్రితం ప్రధాని రష్యా పర్యటన అనంతరం రెండు దేశాల మధ్య సంబంధాల్లో కొంత అసంతృప్తి నెలకొనడం, ఖలిస్తానీ తీవ్రవాది గురుపత్వంగ్ సింగ్ పన్నూపై న్యూయార్క్‌లో జరిగిన హత్యాయత్నం కుట్ర వెనుక భారత్ హస్తముందంటూ అమెరికా ఆరోపిస్తున్న నేపథ్యంలో వీరిద్ధరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. తాజా భేటీలో ఈ రెండు అంశాలు ప్రస్తావనకు వచ్చిందీ లేనిదీ తెలియాల్సి ఉంది. అయితే రష్యా`ఉక్రెయిన్ యుద్ధం, గాజా సంక్షోభంపై జై శంకర్‌తో చర్చించినట్లు బ్లింకెన్ తెలిపారు.






