ట్రంప్‌ను చంపే ఆలోచన మాకు లేదు
అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్‌పై వరుస హత్యాయత్నాలు తీవ్ర కలకలం రేపాయి. దీని వెనుక ఇరాన్ హస్తం ఉన్నట్టు అప్పట్లో ఆరోపణలు రావడంతో అగ్రరాజ్యం గట్టిగా హెచ్చరించింది. ఈ క్రమంలో టెహ్రాన్ స్పందిస్తూ తమకు అలాంటి ఉద్దేశం లేదని చెప్పింది. ఈ మేరకు బైడెన్ సర్కారుకు సందేశం పంపినట్లు తెలిసింది. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పై రెండు సార్లు హత్యాయత్నాలు జరిగాయి. దీంతో అప్పట్లో ఆయన ప్రచార బృందం ఓ ప్రకటన విడుదల చేసింది. యూఎస్ లో అస్థిరత, గందరగోళాన్ని సృష్టించాలని ఇరాన్ ప్రయత్నిస్తుంది. మాజీ అధ్యక్షుడు ట్రంప్‌నకు కచ్చితమైన ముప్పు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ కార్యాలయం హెచ్చరించింది అని అందులో పేర్కొంది.






