Ruby Dalla : కెనడా ప్రధాని రేసులో… మరో భారత సంతతి మహిళ
కెనడా ప్రధాని పదవి కోసం మరో భారతీయ నేత తలపడనున్నారు. ప్రస్తుత ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau )త్వరలో బాధ్యతల నుంచి తప్పుకుంటుండటం తెలిసిందే. అధికార లిబరల్ పార్టీ సారథ్య బాధ్యతలను కూడా వదులుకోనున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో లిబరల్ పార్టీ నేత పదవికి భారత సంతతికి చెందిన పార్టీ నాయకురాలు రూబీ దల్లా (Ruby Dalla) పోటీ పడనున్నారు. రూబీ దల్లా తల్లిదండ్రులు పంజాబ్ నుంచి కెనడా వలస వెళ్లారు. ఆమె కెనడాలో మనిటో బాలోని విన్నిపెగ్‌లో జన్మించారు. బయో కెమిస్ట్రీ, ఆరోగ్య సంరక్షణలో డిగ్రీ చేశారు. కొంతకాలం ఆరోగ్య సంరక్షకురాలు (చిరోప్రాక్టర్)గా పని చేశారు. తర్వాత అందాల పోటీల్లో, సినిమాల్లో (movies ) నూ రాణించారు. 1993లోలో మిస్ ఇండియా-కెనడా పోటీల్లో రెండో స్థానంలో నిలిచారు. అనంతరం పారిశ్రామికవేత్తగా రాణించారు. దల్లా గ్రూప్ ఆప్ ఇండస్ట్రీస్ సీఈవోగా ఉన్నారు. కెనడా పార్లమెంటు (Parliament )కు రెండుసార్లు వరుసగా ఎన్నికైన తొలి భారత సంతతి మహిళగా నిలిచారు. అదే ఊపులో ఆ దేశ ప్రధాని పదవిని చేపట్టిన తొలి నల్లజాతి మహిళగా కూడా రికార్డు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు.






