Abhijit Patel: ‘నా బాధ్యత’ అంటూ తండ్రిని హత్య చేసిన భారత సంతతి వ్యక్తి
అమెరికాలోని ఇల్లినాయిస్ (Illinois) రాష్ట్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మానసిక సమస్యలతో (Schizophrenia) బాధపడుతున్న ఓ 28 ఏళ్ల భారత సంతతి యువకుడు (Indian Origin Man) తన సొంత తండ్రినే కిరాతకంగా హత్య చేశాడు. షాంబర్గ్ (Schaumburg) ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిందితుడిని అభిజిత్ పటేల్‌గా (Abhijit Patel) పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. భారత సంతతికి (Indian Origin Man) చెందిన అభిజిత్ తన 67 ఏళ్ల తండ్రి అనుపమ్ పటేల్‌ను (Anupam Patel) సుత్తితో (Sledgehammer) తలపై బలంగా కొట్టి చంపాడు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయిన అభిజిత్.. విచారణ సమయంలో వింత వాదనలు వినిపించాడు. చిన్నప్పుడు తన తండ్రి తనను లైంగికంగా వేధించాడని, అందుకే ఆయనను చంపడం తన ‘మతపరమైన బాధ్యత’ (Religious Duty) అని పేర్కొన్నాడు. అయితే వైద్యులు ఇది అతని మానసిక స్థితి (Delusion) సరిగా లేకపోవడం వల్ల వచ్చిన అపోహ అని స్పష్టం చేశారు. అభిజిత్ (Indian Origin Man) స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్నాడని, గతంలో కూడా చికిత్స పొందాడని కోర్టు రికార్డులు చెబుతున్నాయి. తండ్రిని చంపేస్తానని బెదిరించడంతో గతంలోనే అతనిపై ప్రొటెక్షన్ ఆర్డర్ ఉన్నా.. తల్లిదండ్రులు అతన్ని ఇంట్లోనే ఉండనివ్వడం ఈ విషాదానికి దారితీసింది. ప్రస్తుతం అభిజిత్ పోలీసుల అదుపులో ఉన్నాడు.






