Indians in Canada: కెనడాలో భారతీయులకు రక్షణ కరువు? వరుస హత్యలతో భయాందోళనలు
కెనడాలోని టొరంటోలో వారం రోజుల వ్యవధిలో ఇద్దరు భారతీయులు (Indians in Canada) దారుణ హత్యకు గురికావడం అక్కడ నివసిస్తున్న భారతీయ సమాజంలో (Indian Diaspora) తీవ్ర భయాందోళనలను రేకెత్తిస్తోంది. పెరుగుతున్న “యాంటీ-ఇండియన్ సెంటిమెంట్” (Anti-Indian Sentiment) దీనికి కారణమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిసెంబర్ 23న 20 ఏళ్ల భారతీయ విద్యార్థి శివాంక్ అవస్తిని (Shivank Avasthi) టొరంటోలో కొందరు దుండగులు కాల్చి చంపారు. అంతకుముందే డిసెంబర్ 20న హిమాన్షి ఖురానా (30) అనే మరో మహిళ తన ఇంట్లోనే శవమై తేలింది. ఈమె హత్య వెనుక ఆమె లివ్-ఇన్ పార్ట్నర్ అబ్దుల్ గఫూరీ హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలా మూడు రోజుల వ్యవధిలోనే ఇద్దరు భారతీయులు (Indians in Canada) హత్యకు గురికావడం స్థానికంగా భయాందోళనలు కలిగిస్తోంది.
ఇలా కెనడాలోని భారతీయులపై (Indians in Canada) దాడులు జరగడంపై కెనడాకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ డానియల్ బోర్డ్మాన్ (Daniel Bordman) స్పందించారు. టొరంటో పోలీసుల నిర్లక్ష్యంపై ఆయన మండిపడ్డారు. భారతీయులకు వ్యతిరేకంగా హింస పెరుగుతున్న ధోరణిని పోలీసులు సీరియస్గా తీసుకోవడం లేదని, నిందితులను పట్టుకోవడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆయన ఆరోపించారు. కేవలం హత్య కేసులే కాకుండా, ఖలిస్తానీ సానుభూతిపరుల ఆందోళనల నేపథ్యంలో భారతీయుల (Indians in Canada) భద్రత ప్రమాదంలో పడిందన్న వాదనలకు ఈ ఘటనలు బలం చేకూరుస్తున్నాయి.






