Musk Doze : మస్క్ డోజ్ లో భారత సంతతి కుర్రాడు
వృథా ఖర్చులను తగ్గించడం, ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే లక్ష్యంగా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డీఓజీఈ) శాఖను ఏర్పాటు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump). ఈ బాధ్యతలను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) కు అప్పగించారు. తాజాగా ఈ విభాగం ఆరుగురు యువ ఇంజినీర్లను విధుల్లోకి తీసుకుంది. వీరిలో భారత సంతతికి చెందిన ఆకాశ్ బొబ్బ (Akash Bobba) కూడా ఉన్నారు. ఆకాశ్ బెర్కెలీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా (University of California )లో మేనేజ్మెంట్, టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్‌కు హాజరయ్యారు. మెటా, పలంటీర్ సంస్థల్లో ఇంటర్న్‌గా పనిచేశాడు. ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ బ్రిడ్జ్‌వాటర్ అసోసియేట్స్‌లోనూ కొంతకాలం పనిచేసినట్లు సమాచారం. ఆఫీస్ ఆప్ పర్సనల్ మేనేజ్మెంట్లో అతడు నిపుణుడని తెలుస్తోంది. ఆకాశ్‌తో పాటు ఎడ్వర్డ్ కొరిస్టీన్, ల్యూక్ ఫారిటర్, గౌటియర్ కోల్ కిలియాన్, గావిన్ క్లిగెర్, ఇథాన్ షావోత్రన్ను కూడా డోజ్ ఉద్యోగులుగా నియమించారు.
\






