Vinay Prasad: ఎఫ్‌డీఏ వ్యాక్సిన్స్ విభాగం హెడ్‌గా ఇండియన్ అమెరికన్

అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) వ్యాక్సిన్ విభాగం సెంటర్ ఫర్ బయోలాజిక్స్ ఎవాల్యుయేషన్ అండ్ రీసెర్చ్ (సీబీఈఆర్) డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన హెమటాలజిస్ట్-ఆంకాలజిస్ట్ వినయ్ ప్రసాద్ (Vinay Prasad) నియమితులయ్యారు. ఎఫ్‌డీఏ కమిషనర్ (FDA Commissioner) మార్చి మకారీ ఈ విషయాన్ని వెల్లడిరచారు. ప్రసాద్‌కు మెడిసిన్ (Medicine)లో సుదీర్ఘమైన, విశిష్టమైన చరిత్ర ఉందని, ఆయన ఆంకాలజీలో విసృతమైన పరిశోధనలు చేశారని మకారీ (Macarius) పేర్కొన్నారు. సీబీఈఆర్ ఎఫ్‌డీఏ (CBER FDA) కింద ఉన్న టీకాలు, ఔషధాలను పర్యవేక్షిస్తుంది. ప్రసాద్ గతంలో ఎఫ్‌డీఏను, కోవిడ్-19 వ్యాక్సిన్, మాస్క్ ఆదేశాలను తీవ్రంగా విమర్శించడం గమనార్హం.