Delhi: రష్యా ఆయిల్ డీల్ టెంప్టింగ్ గా ఉంది… అక్కడే కొంటామంటూ ట్రంప్ సర్కార్ కు ఢిల్లీ క్లారిటీ..

అగ్రరాజ్యం హెచ్చరికలా…? 150 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలా..? అంటే మేం ఎప్పుడూ మాదేశం ప్రయోజనాలే చూసుకుంటాం.. ఇదీ అగ్రరాజ్యం అమెరికాకు .. మోడీ (Modi) సర్కార్ ఇచ్చిన క్లారిటీ.. మీరెన్ని సార్లు హెచ్చరించినా.. ఎన్నిఆంక్షలు వేసినా.. మేం వెనక్కు తగ్గేది లేదు.మంచి డీల్ ఎక్కడుంటే.. అక్కడే కొంటాం.. ఈ విషయంలో మాప్రాధాన్యతలు వేరు.. ఇదీ అమెరికా సర్కార్ కు భారత్ రాజకీయ నాయకత్వం, బ్యూరోక్రాట్లు చెబుతున్న మాటలు.
భారత్, రష్యానుంచి క్రూడ్ ఆయిల్ కొనటం అంటే.. ఇక్రెయిన్‌పై యుద్ధం చేయడానికి రష్యాకు నిధులు సమకూరుస్తున్నట్లే అని ఆయన అన్నారు. ట్రంప్ హెచ్చరికల్ని భారత్ ఏమాత్రం లెక్కచేయలేదు.
రష్యా (Russia) నుంచి క్రూడ్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటూ ఉంది. దీంతో ట్రంప్ ఆగ్రహానికి గురయ్యారు. ఏకంగా 50 శాతం టారీఫ్ విధించారు. అయినా కూడా భారత్ వెనక్కు తగ్గలేదు. ఈ విషయంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ… వారం రోజుల క్రితం మాట్లాడారు. తాము ఎవరి బెదిరింపులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. తమకు భారత ప్రజల ప్రయోజనాలే ముఖ్యం అని అన్నారు. ఈ నేపథ్యంలోనే రష్యా తన మిత్ర దేశం భారత్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చింది. క్రూడ్ ఆయిల్‌పై ఏకంగా 5 శాతం డిస్కౌంట్ ప్రకటించింది.
రష్యానుంచి భారత్ క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోవటంపై రష్యాలోని భారత అంబాసిడర్ వినయ్ కుమార్ స్పందించారు. తాజాగా, రష్యా ప్రభుత్వ మీడియా టాస్ ఏజెన్సీకి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దేశంలోని ఆయిల్ కంపెనీలు ఆయిల్ ఎక్కడ తక్కువకు దొరికితే అక్కడే కొంటాయి. భారత ప్రభుత్వానికి దేశ ప్రజల ప్రయోజనాలే ముఖ్యం. ప్రజలకు సరిపడా ఆయిల్ అందించడానికి తగిన చర్యలు తీసుకుంటుంది. రష్యాతో పాటు పలు దేశాలకు భారత్ పరస్పర సహకారం అందించటం వల్ల జాతీయ ఆయిల్ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ ఆయిల్ మార్కెట్ నిలకడగా ఉంది. అంతెందుకు.. రష్యాతో అమెరికా కూడా వ్యాపారాలు చేస్తోంది కదా..’ అని అన్నారు.