భారత్, అమెరికా కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాయి : రాజ్నాథ్ సింగ్
భారత్, అమెరికాలు కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాయని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో భాగంగా నాలుగు రోజుల పర్యటన నిమిత్తం రాజ్నాథ్ సింగ్ అమెరికా వెళ్లారు. అక్కడి మేరీలాండ్లో ఆ దేశ అగ్రశ్రేణి ఉపరితల నౌకాదళ యుద్ధ కేంద్రాన్ని సందర్శించారు. కార్డెరాక్లోని ఉపరితల నౌకదళ యుద్ధ కేంద్రాన్ని సందర్శించి, అక్కడి ప్రయోగాలు చూశాను. భారత్, అమెరికా కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాయి. ఒకరి అనుభవాల ద్వారా మరొకరు లబ్ధిపొందాలని అనుకుంటున్నాయి అని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.






