సిక్స్ పిల్లర్స్ పై సింగపూర్‌తో .. భారత్ చర్చలు
వచ్చే నెల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సింగపూర్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఇరు దేశాల మంత్రుల మధ్య రెండో ఇండియా-సింగపూర్ మంత్రిత్వ రౌండ్ టేబుల్ సమావేశం (ఐఎస్ఎంఆర్) జరిగింది. ఇందులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ పాల్గొన్నారు. ఈ ఐఎస్ఎంఆర్ భేటీ భవిష్యత్తులో అభివృద్ధి చెందనున్న ఆరు రంగాలు సిక్స్ పిల్లర్స్ ( డిజిటల్, నైపుణ్యాభివృద్ధి, సుస్థిరత, ఆరోగ్యరంగం, తయారీ రంగం, కనెక్టవిటీ)పై దృష్టి పెట్టారు. చర్చలు ఫలప్రదంగా జరిగాయని జైశంకర్ పేర్కొన్నారు.






