ప్రధాని మోదీ పర్యటన ఓ గేమ్ ఛేంజర్
భారత ప్రధాని నరేంద్ర మోదీ మాస్కో పర్యటన, పుతిన్‌తో జరిగిన చర్చలు చరిత్రాత్మకమని రష్యా పేర్కొంది. ఈ పర్యటనను గేమ్ ఛేంజర్‌గా అభివర్ణించింది. ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా రష్యా సైన్యంలో ఉన్న భారతీయులను వెనక్కి రప్పించడంతో పాటు పలు కీలకాంశాలపై పుతిన్`మోదీలు ప్రధానంగా దృష్టి సారించినట్లు భారత్‌లోని రష్యా రాయబార కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఘర్షణ పూరిత భౌగోళిక రాజకీయాలు పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మాస్కోలో పర్యటించి, పుతిన్‌తో వార్షిక శిఖరాగ్ర చర్చలు జరపడం చరిత్రాత్మకమని, ఈ పరిణామం గేజ్ ఛేంజర్ అని భారత్‌లోని రష్యా దౌత్యవేత్త రోమన్ బాబుష్కిన్ పేర్కొన్నారు.
మోదీ పర్యటనను యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా గమనించిందన్న ఆయన, ఇరుదేశాల మధ్య వాణిజ్య విస్తరణ, స్థానిక కరెన్సీలో చెల్లించపులపై ఇరువురు నేతలు ప్రధానంగా చర్చలు జరిపారన్నారు. తమ సైన్యంలో పనిచేస్తున్న భారతీయులను వెనక్కి పంపించే అంశంపై ఇరు దేశాలు ఒకేలా ఆలోచిస్తున్నాయని న్నారు. దీనికి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.






