డొనాల్డ్ ట్రంప్‌కు.. ఫేస్బుక్ క్షమాపణలు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం సమయంలో ఆయన పిడికిలి బిగించిన ఉన్న ఫొటోను నకిలీగా గుర్తించడంపై ఫేస్బుక్ క్షమాపణలు తెలిపింది. ఫ్యాక్ట్ చెక్‌లో భాగంగా ట్రంప్ ఫొటోలను పరిశీలిస్తున్న సమయంలో ఒరిజినల్ ఫొటోను సిస్టమ్ ఫేక్‌గా గుర్తించిందని ఫేస్బుక్ వెల్లడిరచింది. ఈ విషయంపై మెటా పబ్లిక్ అఫైర్స్ డైరెక్టర్ డాని లివర్ స్పందించారు. ట్రంప్ ఫొటోలను ఫ్యాక్ట్ చెక్ చేస్తున్న సమయంలో అతడి చుట్టూ ఉన్న రహస్య ఏజెంట్లు నవ్వుతున్నట్లుగా ఉన్న ఓ ఫొటోను ఫేక్‌గా గుర్తించిన సిస్టమ్.. ఒరిజినల్ ఫొటోకు కూడా ఫేక్ అని తప్పుడు లేబులింగ్ ఇచ్చింది. సిస్టమ్‌లో సాంకేతిక సమస్యల కారణంగా ఒక్కోసారి ఇలా జరుగుతుంది. పొరపాటును గుర్తించి సరిదిద్దుకున్నాం. క్షమాపణలు తెలియజేస్తున్నాం అని డాని లివర్ తెలిపారు.






