United Nations: భారత్, పాక్‌లకు ఐరాస పిలుపు

పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, అయితే పరిస్థితి మరింత చేయిదాటిపోకుండా భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) ప్రభుత్వాలు అత్యంత సంయమనం పాటించాలని ఐరాస(United Nations) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్(Antonio Guterres) విజ్ఞప్తి చేశారు. రెండు దేశాల మధ్య పరిస్థితిని ఆయన జాగ్రత్తగా గమనిస్తున్నారని గుటెరస్ ప్రతినిధి స్టెఫాన్ దుజారిక్ (Stephane Dujarric) మీడియాకు తెలిపారు. ఉగ్రదాడిని పురస్కరించుకుని భారత్ సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేయడం గురించి ప్రశ్నించగా రెండు దేశాలూ సంయమనం పాటిస్తూ ఉద్రికత్తలు పెరగకుండా చూసుకోవాలని దుజారిక్ తెలిపారు. అంతకుముందు పహల్గాం ఉగ్రదాడిని గుటెరస్ తీవ్రంగా ఖండిరచారు.