Gaza: గాజాను అమెరికా తీసుకోవాలి

పశ్చిమాసియా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గాజా (Gaza) కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాలోని పాలస్తీనియన్లు ఖాళీ చేయాలని గతంలో ప్రతిపాదించిన ట్రంప్ గాజాను అమెరికా (America) ఆధీనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. గాజా ఫొటోలను చూశాను. అక్కడ ఒక్క భవనమూ లేదు. అన్నీ కుప్పకులాయి. ఆ శిథిలాల కిందే ప్రజలు ఉంటున్నారు. ఇదీ అంగీకారయోగ్యం కాదు. గాజాను అమెరికా తీసుకోవాలని అనుకుంటున్నాను. స్వేచ్ఛా మండలంగా దాన్ని మలచాలి. గాజాకు సంబంధించి నాకు మంచి ఆలోచనలు ఉన్నాయి అని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ (Iran)తో జరుగుతున్న అణుచర్చలకు సంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చి (Abbas Araghchi) తో జరుగుతున్న చర్చలు దీర్ఘకాల శాంతిని సాధిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా చేసిన ప్రతిపాదనకు ఇరాన్ దాదాపు అంగీకరించిందన్నట్లు వ్యాఖ్యలు చేశారు.