అబుదాబిలో నూకలమర్రి గ్రామానికి చెందిన పెండ్యాల చంద్రకాంత్ మృతి
చంద్రకాంత్ మృతదేహాన్ని భారత్‌కు రప్పించడానికి ఆయన కుటుంబ సభ్యులు మరియు వారి బంధువు, మాజీ సర్పంచ్ తిరుపతి ద్వారా గల్ఫ్ జె ఏ సి ఉపాధ్యక్షుడు గంగుల మురళీధర్ రెడ్డి సహాయాన్ని అభ్యర్థించగా గంగుల మురళీధర్ రెడ్డి ఎంబస్సీకి ఐసిడబ్ల్యూఎఫ్ (ICWF) ఫండ్ సహాయంతో మృతదేహం రప్పించాలని రాయబార కార్యాలయాన్ని అభ్యర్థిస్తూ, తెలంగాణ ప్రభుత్వాన్ని ఉచిత అంబులెన్స్ సౌకర్యం కల్పించమని కూడా కోరుతూ , వారికి కావలసిన అఫిడేవిట్ పత్రాలను రెక్వెస్ట్ పాత్రలకు సహకరించారు .
తెలంగాణ ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్ అధికారి చిట్టిబాబు ఐసిడబ్ల్యూఎఫ్ (ICWF) ఫండ్ ద్వారా మృతదేహాన్ని రప్పించాలని ఎంబస్సీకి టెలెక్స్ పంపి అభ్యర్థించారు. మరియు అంబులెన్స్ సహకారం ఇవ్వనున్నారు.
ప్రభుత్వ మరియు ఇతరులు సమన్వయం ద్వారా సహాయం: ఈ ప్రయత్నానికి మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా మద్దతు అందించారు. అబు ధాబి లో ఉన్న వారి బంధువులు పండ్ల రమేశ్ మరియు గుగ్గిల్ల తిరుపతి ఈ విషయం లో పని చేస్తూ GWAC అద్యక్షుడు గద్బండ నరేందర్ టీమ్ మరియు మాజీ ఐఎస్సి సెక్రెటరీ ఐత రాజ శ్రీనివాస రావు ల సహకారం తో మృతదేహన్ని ఉచితం గా భారత్‌కు రప్పించడానికి సహకరించారు వీరి కృషి అభినందనీయం .
కుటుంబంలో విషాదం : పెండ్యాల చంద్రకాంత్ మరణంతో ఆయన భార్య లావణ్య (42), కుమారుడు సాయి తేజ (20) కూతురు హాసిని (17) మరియు కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
సమిష్టి కృషి ఫలితంగా, ఎంబస్సీ టికెట్ ఇచ్చి సహకరించడంతో పాటు, ఉచిత అంబులెన్స్ అందించిన తెలంగాణ ప్రభుత్వానికి, అధికారి చిట్టిబాబుకు,ఎంబసీ అదికారులకు , మరియు గల్ఫ్ జె ఏ సి టీం కి, GWAC అద్యక్షుడు గద్బండ నరేందర్ టీం కి, మరియు కేరళ సోషల్ వర్కర్లు షాకిబ్ మరియు శకీర్, జగిత్యాలకు చెందిన సర్వేశ్వర్ , రాజీ రెడ్డి ట్రాన్స్పోర్ట్ సపోర్ట్ , ప్రత్యేకంగా మాజీ ఐఎస్సి సెక్రెటరీ ఐత రాజ శ్రీనివాస రావు కు, గంగుల మురళీధర్ రెడ్డి కి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
గంగుల మురళీధర్ రెడ్డి: మేనిఫెస్టోలో ప్రకటించిన గల్ఫ్ కార్మికుల సంక్షేమం అటక ఎక్కినట్టేనా!
గల్ఫ్ నుంచి ఇట్లా అమృతదేహాలు వస్తూనే ఉన్నాయి, ఎన్నికల మేనిఫెస్టోలో గల్ఫ్ కార్మికుల సంక్షేమం అనే టైటిల్‌తో ఎన్నారైలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్న వాగ్దానాలు ఏరోజు తీపి కబురును ఇస్తాయో.






