అర్ష్ దల్లా అరెస్టుపై భారత అధికారులతో చర్చిస్తున్నాం : కెనడా
భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించిన ఖలిస్థానీ వేర్పాటువాది అర్షదీప్ సింగ్ అలియాస్ అర్ష్ దల్లాను కెనడా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతడిని తమకు అప్పగించాలని ఇటీవల కెనడాను భారత్ కోరింది. ఈ విషయంపై కెనడా విదేశాంగ శాఖ మంత్రి మెలానీ జోలీ స్పందిస్తూ అతడిని అప్పగించే విషయంపై భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌తో చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు. పెరూలోని లిమాలో జరిగిన ఆసియా`పసిఫిక్ ఆర్థిక సహకార వార్షిక మంత్రివర్గ సమావేశంలో మెలానీ జోలీ మాట్లాడుతూ ప్రస్తుతం అర్ష్ దల్లా కేసులో విచారణ జరుగుతోందని, కాబట్టి ఆ విషయంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదని అన్నారు. అతడికి సంబంధించి ఏవైనా విచారణలు చేయాల్సి ఉంటే భారత దౌత్యవేత్తలతో చర్చలు జరుపుతామని తెలిపారు.






