అమెరికాలో బీభత్సం .. అంధకారంలో 6 లక్షల
వాషింగ్టన్, ఒరెగాన్ తదితర రాష్ట్రాలతో కూడిన వాయవ్య అమెరికా తీత్ర తుపాను ( బాంబ్ సైక్లోన్) బీభత్సం సృష్టిస్తోంది. బలమైన గాలులు, భారీ వర్షం కారణంగా వాషింగ్టన్ రాష్ట్రంలో దాదాపు 6 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పెద్దసంఖ్యలో చెట్లు కూలిపోయాయి. కొన్ని చెట్లు ఇళ్లపై పడటంతో భయానక వాతావరణం నెలకొంది. ఈ రాష్ట్రంలోని లిన్‌వుడ్ లో చెట్టు కూలి శిబిరంపై పడడంతో ఓ మహిళ మృతి చెందినట్లు అక్కడి అగ్నిమాపక దళం వెల్లడించింది. కాలిఫోర్నియాలో 19 వేలు, ఒరెగాన్‌లో 15 వేల ఇళ్లకు విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తింది. తుపాను మరింత తీవ్రం కావొచ్చని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.






