ఈ యుద్ధం త్వరలోనే ముగుస్తుంది : బైడెన్
రష్యా భీకర దాడులతో అల్లాడిపోతున్న ఉక్రెయిన్‌కు తాము ఐదు వ్యూహాత్మక గగనతల రక్షణ వ్యవస్థలను సరఫరా చేస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఈ యుద్ధం త్వరలోనే ముగుస్తుందని జోస్యం చెప్పారు. ఉక్రెయిన్ కచ్చితంగా సురక్షితంగా ఉంటుందని, రష్యాకు మాత్రం రక్షణ లేదని వ్యాఖ్యానించారు. వాషింగ్టన్లో నాటో దేశాధినేతల సదస్సు ప్రారంభోపన్యాసంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఈ సైనిక కూటమి ఎన్నడూ లేనంత శక్తిమంతంగా ఉందని, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు పెను మార్పు దశను ఎదుర్కొంటోందని తెలిపారు.






