క్వాడ్ సదస్సుకు జో బైడెన్.. ఈసారి భారత్‌లో
ఈ ఏడాది భారత్‌లో జరగనున్న క్వాడ్ దేశాధినేతల సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌజ్ అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది క్వాడ్ నేతల సదస్సుకు హాజరయ్యేందుకు ఇప్పటికే మేం కట్టుబడి ఉన్నామని వైట్‌హౌజ్ నేషనల్ సెక్యూరిటీ కమ్యూనికేషన్ సలహాదారు జాన్ కిర్బీ పేర్కొన్నారు. కరోనా కారణంగా 2020 నుంచి క్వాడ్ సదస్సులు వర్చువల్ విధానంలో జరుగుతున్నాయి. ఈ ఏడాది భారత్‌లో నిర్వహించాలని నిర్ణయించగా, పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సదస్సుకు ఎట్టకేళకు షెడ్యూల్ ఖరారైనట్లు సమాచారం. అయితే, తేదీలను మాత్రం ఇంకా ప్రకటించలేదు. సదస్సుకు హాజరయ్యేందుకు జో బైడెన్ అయిష్టత ప్రదర్శించడంతో క్వాడ్ సదస్సును ఈ ఏడాది జనవరి నెలలో వాయిదా వేశారు. కాగా, అధ్యక్ష ఎన్నికల బరి నుంచి బైడెన్ తప్పుకోవడంతో ఉన్న అవకాశాల మేరకు ఈ సదస్సుకు బైడెన్ హాజరవుతారని వైట్‌హౌజ్ ప్రకటన వెలువరించింది.






