పరిస్థితుల్ని నిశితంగా గమనిస్తున్నాం : అమెరికా
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్, లెబనాన్లలోని సంఘటనలను నిశితంగా పర్యవేక్షిస్తున్నారని అమెరికా జాతీయ భద్రత మండలి అధికార ప్రతినిధి సీన్ సావెట్ తెలిపారు. సీనియర్ విదేశాంగ అధికారులు ఇజ్రాయెల్ సహచరులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని సావెట్ పేర్కొన్నారు. మేము ఇజ్రాయెల్ ఆత్మరక్షణ హక్కును మద్దతు ఇస్తూనే ఉంటాము. ప్రాంతీయ స్థిరత్వం కోసం పని చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఇటీవల వారాల్లో యూఎస్, ఐరోపా దేశాల దౌత్యవేత్తలు ఇజ్రాయెల్, లెబనాన్లను సందర్శించి, యుద్ధ భయాలను తొలగించే ప్రయత్నాలు చేశారు. శాంతి చర్చలకు సన్నాహాలు చేస్తున్న దశలో, తాజా పరిణామం ఆందోళనకు గురిచేస్తోంది.






