బంగ్లాదేశ్ పార్లమెంట్ రద్దు… త్వరలోనే
బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో షేక్ హసీనా ప్రధాని పీఠం నుంచి దిగిపోయి దేశాన్ని వీడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దేశ పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ ప్రకటించారు. దీంతో దేశంలో త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కానుంది. త్రివిధ దళాల అధిపతులు, పలు రాజకీయ పార్టీల నేతలు, విద్యార్థి సంఘాల నేతలు, ఉద్యమ నాయకులతో అధ్యక్షుడు షహబుద్దీన్ చర్చలు జరిపారు. అనంతరం ఈ ఏడాది జనవరిలో ఎన్నికైన పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు అని అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడిరచింది.






